ఎన్నికలలో నాగబాబు పెట్టిన ఖర్చు…!

ఎన్నికలలో నాగబాబు పెట్టిన ఖర్చు…!

ఎన్నికలలో నాగబాబు పెట్టిన ఖర్చు…!
 
జనసేన పార్టీ క్లీన్ అండ్ క్లియర్ పాలిటిక్స్ చేస్తుందని తెగ చెబుతుంటారు ఆ పార్టీకి చెందిన నాయకులు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ఎక్కడా కూడా డబ్బులు పంచ లేదని తెగ ఊదరకొడుతున్న క్రమంలో తాజాగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఎన్నికలలో పెట్టిన ఖర్చు బయటకు వచ్చింది. ఎన్నికలకు మూడు నెలల ముందు జనసేన పార్టీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నాగబాబు దారుణంగా ఓడిపోవడం జరిగింది.
 
ఇటువంటి క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు పార్లమెంట్ - 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన ఎంపీ - ఎమ్మెల్యే అభ్యర్థుల లెక్కలను ఎన్నికల వ్యయ పరిశీలకులు విడుదల చేశారు. ప్రధానంగా మూడు పార్టీలు టీడీపీ - వైసీపీ - జనసేన అభ్యర్థులు కలిపి 9.16 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకు 28 లక్షలు - ఎంపీ 70 లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులకు ఈసీ పరిమితి ఇచ్చింది.
 
ఇక మన మెగా బ్రదర్ నాగబాబు నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా రూ.48 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపాడని ఎన్నికల వ్యవ పరిశీలకులు తెలిపారు. ఇలా క్లీన్ పాలిటిక్స్ - ఖర్చు పెట్టలేదని చెప్పిన నాగబాబు కూడా మోస్తారుగానే ఖర్చు పెట్టారని ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది.Top