ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాల్సిందే: జగన్..!

ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాల్సిందే: జగన్..!

ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాల్సిందే: జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తనకి చరిత్రలో మరిచిపోలేని విజయాన్ని అందించడంతో జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రజలను ఎంతగానో సంతోష పెడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టి కేవలం నెల రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్ తాజాగా ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
 
నేడు ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరుపుతూ ఈ ఏడాది శాచ్యురేషన్ విధానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఉగాదిలోపు ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. వైఎస్ఆర్ ఇళ్ల కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో కూడా భారీ దోపీడికి పాల్పడ్దారని ఆరోపించారు. అయితే అర్బన్ హౌసింగ్‌లో ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసాడు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఇళ్లు లేదని బాధపడకూడదని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చి తీరుతానని సీఎం జగన్ స్పష్టం చేసారు.Top