కాపు ఓటు బ్యాంకు జారిపోకుండా చంద్రబాబు సంచలన నిర్ణయం..?

Written By Siddhu Manchikanti | Updated: July 03, 2019 11:21 IST
కాపు ఓటు బ్యాంకు జారిపోకుండా చంద్రబాబు సంచలన నిర్ణయం..?

కాపు ఓటు బ్యాంకు జారిపోకుండా చంద్రబాబు సంచలన నిర్ణయం..?
 
కులాల వారీగా ఎన్నికలలో హామీలు ఇస్తూ చాణిక్య రాజకీయ నేతగా తెలుగు రాజకీయాలలో పేరు సంపాదించుకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఊహించలేనంతగా చెత్త చెత్తగా ఫలితాలు రాబట్టారు. దీంతో ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే కాపు ఓటు బ్యాంక్ ప్రస్తుత పరిణామాలను బట్టి పోతున్న క్రమంలో చంద్రబాబు సంచలన నిర్ణయం చేసుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఇటీవల తాజాగా చంద్రబాబు కాపు నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటా. లోపాలు సరిదిద్దుకుందాం’ అని హామీ ఇచ్చారు.
 
‘సామాజికవర్గాల వారీగా సమావేశాలు పెట్టవద్దు.. ఇలాంటివి పార్టీకి ఇబ్బందికరం.. ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలని ఆయన కోరారు. కాగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించామని కాపు నేతలు చెప్పారు.. మా ఆలోచనల్లో తప్పుంటే సరిదిద్దుకున్నాం. అధినేత తన ఆలోచనల్లో లోపాలున్నాయని అంగీకరించారు’ అని త్రిమూర్తులు తెలిపారు. ఇదే క్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న టీడీపీ నేతలు రానున్న రోజుల్లో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాలు చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ పునరావృతం అవుతుందని చంద్రబాబుకి సూచించడంతో... భవిష్యత్తులో చేయవలసినవి చేద్దామని ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమీ కూడా పెట్టుకోవద్దు అంటూ నేతలకు సూచించినట్లు సమాచారం.
Top