రియల్ పొలిటిషన్ అనిపించుకున్న జగన్..!

Written By Siddhu Manchikanti | Updated: July 05, 2019 13:35 IST
రియల్ పొలిటిషన్ అనిపించుకున్న జగన్..!

రియల్ పొలిటిషన్ అనిపించుకున్న జగన్..!
 
వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన విషయంలో ఎవరు రాజీ పడకూడదు అని ప్రజలకు సేవకులు గా మారాలని కలెక్టర్ల మంత్రుల సమీక్ష సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇదే క్రమంలో న్యాయం ప్రతి ఒక్కరికి జరిగేలా పోలీసులు వ్యవహరించాలని లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతి ఒక్కరి కి ఒకేలా వర్తింపజేయాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తూ సీఎం జగన్ పోలీసుల ఉన్నతాధికారుల సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో మాటలు చెప్పే నాయకుడిగా కాకుండా రియల్ పొలిటిషన్ అనిపించుకున్నారు జగన్. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించక వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, జగన్ పాలన పార్టీలకు అతీతంగా జరుగుతోందని అనుకోవాలి. తెలుగుదేశం మీడియాలో వచ్చిన ఒక కదనం ప్రకారం రాయలసీమలో పేకాటక్లబ్ లపై దాడి చేసినప్పుడు అరెస్టు అయినవారిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి కూడా ఉన్నారట. ఆయన పేరు రాయలేదు కాని ఇంతవరకు రాశారు.ఆయనతో పాటు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పేకాట శిబిరాలపై దాడి చేసిన పోలీసులకు 50 మంది పేకాటరాయుళ్లు చిక్కారు. ఇక్కడ పట్టుబడినవారిలో లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలు ఉన్నారు. అటు కర్నూలు క్లబ్, యునైటెడ్ క్లబ్, ఆఫీసర్స్ క్లబ్‌లోనూ పోలీసుల సోదాలు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోందని రాశారు. పేకాట క్లబ్ లపై దాడులు చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Top