టి‌ఆర్‌ఎస్ లో ఆర్ధికంగా బలంగా ఉన్నవారి మీద గురి పెట్టిన బీజేపీ ?

Written By Siddhu Manchikanti | Updated: July 05, 2019 13:36 IST
టి‌ఆర్‌ఎస్ లో ఆర్ధికంగా బలంగా ఉన్నవారి మీద గురి పెట్టిన బీజేపీ ?

టి‌ఆర్‌ఎస్ లో ఆర్ధికంగా బలంగా ఉన్నవారి మీద గురి పెట్టిన బీజేపీ ?
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో పార్లమెంటులో ఎవరి మద్దతు లేకుండా అత్యధిక మెజారిటీ స్థానాలు గెలిచి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది బిజెపి. ఇటువంటి క్రమంలో ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బిజెపి దక్షిణ భారతదేశంలో కూడా విస్తరింపజేయాలని దక్షిణాది రాష్ట్రాలపై ప్రస్తుతం ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమక్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. ఇటువంటి క్రమంలో బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీపై భారీ స్కెచ్ వేసింది. అసలు విషయంలోకి వెళితే టీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా బలంగా ఉండే వ్యక్తుల పై బిజెపి ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు సమాచారం. రెండోసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల దేశవాళీ లో జరిగిన ఎన్నికలలో పూర్తిగా తన పట్టు కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీ రాబోతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. దీంతో ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీని ఆర్థికంగా దెబ్బకొట్టి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాగా వేసే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.
Top