కే‌సి‌ఆర్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ?

Written By Siddhu Manchikanti | Updated: July 05, 2019 13:38 IST
కే‌సి‌ఆర్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ?

కే‌సి‌ఆర్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ?
 
తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం హరితహారం. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు చేసినట్లు సమాచారం. గతంలో హరితహారం లో భాగంగా సిద్దిపేట జిల్లాలో కోమటిబండ గ్రామంలో మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు దారి పొడవునా ఏపుగా పెరిగి పెద్ద వనాన్ని తలపించేలా తయారయ్యాయి… కాగా తెలంగాణాలో చాలా వరకు ఈ మొక్కలతో కుడైన చిత్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. చాలావరకు అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వలన అక్కడ ప్రకృతి విధ్వంసం పెరిగి అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులన్నీ కూడా జనావాసంలోకి చొరబడటం ప్రారంభించాయి. ఈమేరకు జనారణ్యంలో కోతులు కూడా ఎక్కువగా సంచరించడం ప్రారంభించాయి. అయితే అడవుల్లో చెట్లను నరికేయడం వలన అక్కడ ఎటువంటి పండ్లు ఫలాలు దొరక్క ఇండ్ల మీద పడటం మొదలుపెట్టాయి. దీంతో ఎన్నో ప్రమాదాలు కూడా సంభవించాయి. అయితే ఈ హరిత హారం కార్యక్రమం అనేది కోతులను అడవికి పంపించడం వంటి ఉద్దేశంతో కూడా ప్రారంభమైనదనే చెప్పుకోవాలి. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో మొక్కలు నాటారు. దీంతో నాటిన మొక్కలు ఇప్పుడు పెద్దగా ఎదగడంతో అడవులను తలపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ విషయం తెలిసి కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.
Top