లేటెస్ట్ వెర్షన్ - చంద్రబాబు ఓదార్పు యాత్ర !

Written By Siddhu Manchikanti | Updated: July 05, 2019 13:39 IST
లేటెస్ట్ వెర్షన్ - చంద్రబాబు ఓదార్పు యాత్ర !

లేటెస్ట్ వెర్షన్ - చంద్రబాబు ఓదార్పు యాత్ర !
 
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి చనిపోయిన విషయాన్ని తెలుసుకుని చనిపోయిన బాధితుల కోసం వైయస్ జగన్ ఓదార్పు యాత్ర అప్పట్లో చేపట్టడం జరిగింది. జగన్ చేసిన ఆ యాత్ర అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను సంచలనం సృష్టించింది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు లేటెస్ట్ గా ఇదే టైపులో ఓదార్పు యాత్ర మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో ఎలాగైనా కేడర్ ని కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఏపీలో కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఇప్పటికి కూడా దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ దాడిలో గాయపడిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించేందుకు భరోసా యాత్ర చేపట్టారు. అయితే ఈసందర్భంగా ఈనెల 5న ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 8 గంటలకు ఉండవల్లి ఇంటి నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు బయులుదేరతారు. 10:30 గంటలకు ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రాంబపురం చేరుకుంటారు. 10:30 నుంచి 11 :30 వరకు టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తారు. పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి అనంతరం జిల్లా నేతలతో మాట్లాడతారు. చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ యాత్ర ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి మరీ.
Top