పాపం నాదెండ్ల మనోహార్... అతిపెద్ద డైలమా లో పడ్డాడు!

Written By Siddhu Manchikanti | Updated: July 06, 2019 10:54 IST
పాపం నాదెండ్ల మనోహార్... అతిపెద్ద డైలమా లో పడ్డాడు!

పాపం నాదెండ్ల మనోహార్... అతిపెద్ద డైలమా లో పడ్డాడు!
 
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రెండోసారి బంపర్ మెజారిటీతో అధికారం లోకి వచ్చేసింది బీజేపీ. దీంతో ఉత్తరాది భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ ధన బలాన్ని దక్షిణాది రాష్ట్రాలలో కూడా పెంచుకోవాలని ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల పై గురి పెట్టిన బీజేపీ తాజాగా ఏపీలో ఉన్న రాజకీయ నేతలపై కూడా దృష్టి సారించింది. దీంతో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దారుణమైన వ్యతిరేక కామెంట్స్ చేసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బిజెపి పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
 
నోవాటెల్ హోటల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో తండ్రి నాదెండ్ల భాస్కరరావు తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపి పార్టీ గూటికి వెళ్ళటంతో 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరు ఊహించని రీతిలో చిత్తు చిత్తుగా ఓడించిన జనసేన పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్...తన భవిష్యత్తు రాజకీయ కెరియర్ గురించి అతి పెద్ద డైలమాలో పడినట్లు సమాచారం. ఈ పరిణామంతో నాదెండ్ల మనోహర్ రాజకీయ జీవితం గురించి ఆంధ్రాలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు చాలామంది పాపం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Top