రేవంత్ కి ఉన్న ధైర్యం జగన్ కి లేదా?

Written By Siddhu Manchikanti | Updated: July 06, 2019 10:59 IST
రేవంత్ కి ఉన్న ధైర్యం జగన్ కి లేదా?

రేవంత్ కి ఉన్న ధైర్యం జగన్ కి లేదా?
 
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని బిజెపి పార్టీ పై పార్లమెంటులో విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక ఖజానాకు టాక్స్ రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువ సొమ్ము వస్తున్నా గాని దక్షిణాదిపై వివక్ష చూపుతూ ఉత్తర భారత్ పై బిజెపి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం దేశానికి మంచిది కాదని ఇలాగే బీజేపీ వ్యవహరిస్తే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని ఇప్పటిదాకా బీజేపీ ప్రవేశపెట్టిన ఆరు బడ్జెట్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడా కూడా మేలు జరగలేదని పేర్కొన్నారు.
 
ఇదే క్రమంలో దక్షిణాదిలో భాగమైన ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడ మేలు చేసే అంశాలు లేవు. దీంతో చాలామంది రాజకీయ నేతలు రేవంత్ రెడ్డి బీజేపీని నిలదీసినట్లు జగన్ ఎందుకు నిలదీయడంలేదని. అసలే విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీని నిలదీయాలని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు.
Top