'సాక్షి ' లో లొల్లి షురూ... ధర్నా కి దిగబోతున్న ఉద్యోగులు?

Written By Siddhu Manchikanti | Updated: July 06, 2019 11:04 IST
'సాక్షి ' లో లొల్లి షురూ... ధర్నా కి దిగబోతున్న ఉద్యోగులు?

'సాక్షి' లో లొల్లి షురూ... ధర్నా కి దిగబోతున్న ఉద్యోగులు?
 
వైసీపీ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత మీడియా సాక్షి పత్రికా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆందోళన చేపడుతూ ధర్నాకు సిద్ధమయ్యారు. గత మూడు సంవత్సరాల నుండి ఇంక్రిమెంట్లు లేవని ప్రస్తుతం పెంచిన జీతం సరిపోదని సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. గత కొంత కాలం నుండి...సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వైసీపీ గెలిస్తే.. జగన్ సీఎం అయితే.. మూడేళ్ల ఇంక్రిమెంట్ కన్నా.. ఎక్కువ ఇస్తామని యాజమాన్యం చెబుతూ వచ్చింది.
 
జగన్ గెలుపు కోసం ఉద్యోగులంతా ఎదురు చూశారు... ఆ క్షణం రానే వచ్చింది. దీంతో ఇటీవల జీవితం పెంచారు... కానీ పెంచిన జీవితం సరిపోకపోవడంతో ఉద్యోగుల అంచనాలకు తగ్గ రీతిలో జీతాలు పెంచకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అసంతృప్తి నెలకొని సాక్షిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురావడానికి ఆందోళన భారీ స్థాయిలో చేయటానికి సంస్థ ఉద్యోగులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Top