ఏపీ ముఖ్యమంత్రి పై అసభ్యకరమైన పోస్ట్... దెబ్బకి అరెస్ట్...!

Written By Siddhu Manchikanti | Updated: July 06, 2019 11:18 IST
ఏపీ ముఖ్యమంత్రి పై అసభ్యకరమైన పోస్ట్... దెబ్బకి అరెస్ట్...!

ఏపీ ముఖ్యమంత్రి పై అసభ్యకరమైన పోస్ట్...దెబ్బకి అరెస్ట్...!
 
ప్రస్తుతం సమాజంలో ప్రపంచంలో ప్రజలను బాగా ప్రభావితం చేస్తోంది సోషల్ మీడియా. గతంలో ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న సమయంలో ప్రజలు ఎవరైనా ప్రజాప్రతినిధులు గురించి మాట్లాడాలంటే చాలా గౌరవంగా విమర్శ చేయాల్సిన సందర్భమైన..చాలా వినమ్రంగా మాట్లాడేవారు. అయితే సోషల్ మీడియా వచ్చాక స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులో వచ్చాక సామాన్యుడు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అభ్యంతరక పోస్టులు పెట్టడం, అసభ్య పోటోలు పెట్టడం వంటివి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన తెలుగుదేశం కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.
 
అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన పెద్దిబోయిన వెంకట శివరావు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పని చేశాడు. ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో మార్చి 12వ తేదీన రవిచౌదరి అనే వ్యక్తి పోస్టు చేసిన, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్న పోస్టును ఈ నెల ఒకటో తేదీన ఫేస్‌బుక్‌లో తన స్నేహితులకు, పబ్లిక్‌కు వెంకట శివరావు షేర్‌ చేశాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ కార్యకర్త బైనబోయిన సురేష్‌ తుళ్ళూరు డీఎస్పీ కేశప్పకు ఫిర్యాదు చేశారు. అమరావతి సీఐ శివనాగరాజు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌ నిమిత్తం సత్తెనపల్లి కోర్టుకు తరలించారు.
Top