ఖాళీ చేయకపోతే ఊరుకోము .. హుకుం జారీ చేసిన వైకాపా ?

Written By Siddhu Manchikanti | Updated: July 08, 2019 10:51 IST
ఖాళీ చేయకపోతే ఊరుకోము .. హుకుం జారీ చేసిన వైకాపా ?

ఖాళీ చేయకపోతే ఊరుకోము .. హుకుం జారీ చేసిన వైకాపా ?
 
ఏపీ ప్రతిపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన లింగమనేని ఇంటిలో ఉండటం మంచిది కాదని ఖాళీ చేయాలని లేకపోతే ఊరుకోము అంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు లింగమనేని గెస్ట్ హౌస్ ఖాళీ చేసే వరకు వదిలే ప్రసక్తిలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...సొంత ఇల్లు కట్టుకోకుండా అక్రమ నివాసంలో ఉండటం ఎందుకు.. చంద్రబాబుకి స్థోమత లేకపోతే ఇల్లుకి కావాల్సిన భూమి ఇస్తా.. ఓ ఇల్లు కట్టుకోండి అంటూ ఆఫరిచ్చారు ఆర్కే. కరకట్టపై ఉన్న ఇల్లు భూ సమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని చెప్పారు.. భూ సమీకరణలో లింగమనేని ఇల్లు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
 
మరి ప్రభుత్వానికి ఇచ్చేసిన ఇల్లు ఇప్పుడు తనదని చెప్పడానికి లింగమనేనికి హక్కు ఎలా ఉందని ప్రశ్నించారు. గతంలో లింగమనేని రమేష్, చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా మీడియా ముందు ఉంచారు. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం చంద్రబాబుని ఇల్లు ఖాళీ చేయించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
Top