'వై ఎస్ బతికి ఉంటే' అంటూ బాధ పడిన కృష్ణ !

Written By Siddhu Manchikanti | Updated: July 08, 2019 11:09 IST
 'వై ఎస్ బతికి ఉంటే'  అంటూ బాధ పడిన కృష్ణ !

"వై ఎస్ బతికి ఉంటే " అంటూ బాధ పడిన కృష్ణ !
 
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వై.యస్ నీ ఎక్కువగా ప్రేమించే కుటుంబాలలో ఒక కుటుంబం సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం. ముఖ్యంగా ముందు నుండి కృష్ణ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబం నేపథ్యంలో వైయస్ కి దగ్గరగా ఉండేవారు సూపర్ స్టార్ కృష్ణ. అంతేకాకుండా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మభూషణ్ ని కృష్ణ గారికి రావడం జరిగింది. ముఖ్యంగా కృష్ణ గారి కుటుంబానికి సంబంధించిన పద్మాలయ స్టూడియో భూముల విషయంలో వైయస్ చేసిన సాయం ఎవరు మర్చిపోలేనిది.
 
వైయస్సార్ 70 వ జయంతి సందర్భంగా కృష్ణ గారు మాట్లాడుతూ...వైఎస్ బతికే ఉంటే తన భార్య విజయ నిర్మలకు కూడా పద్మభూషణ్ పురస్కారం ఇప్పించేవారని కృష్ణ అంటుండటం విశేషం. ఇటీవలే విజయనిర్మల మరణించిన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె గురించి మాట్లాడుతూ వైఎస్‌ను కూడా గుర్తు చేసుకున్నారు కృష్ణ. సినీ రంగంలో తన కృషిని గుర్తు పెట్టుకుని వైఎస్సే తనకు తానుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తనకు ‘పద్మభూషణ్’ ఇప్పించినట్లు కృష్ణ చెప్పారు. ఆ తర్వాత ఒకటి రెండేళ్ల విరామంతో విజయ నిర్మలకు కూడా పద్మభూషణ్ ఇప్పిస్తానని వైఎస్ తనతో అన్నట్లు కృష్ణ వెల్లడించారు. కానీ అంతలోనే వైఎస్ మరణించారని.. ఆ తర్వాత నిర్మలకు ఏ పురస్కారం రాలేదని కృష్ణ గారి పేర్కొన్నారు.
Top