ధోని కి ఊహించలేని ఆఫర్ ఇచ్చిన బీజేపీ ?

Written By Siddhu Manchikanti | Updated: July 08, 2019 11:12 IST
ధోని కి ఊహించలేని ఆఫర్ ఇచ్చిన బీజేపీ ?

ధోని కి ఊహించలేని ఆఫర్ ఇచ్చిన బీజేపీ ?
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా మెజార్టీ స్థానాలు గెలిచి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది బిజెపి. దీంతో దేశంలో తనకంటూ ఎదురులేకుండా బిజెపి అద్భుతమైన వ్యూహాలు పన్నుతోంది. సెలబ్రిటీలను పార్టీలోకి తీసుకొని ప్రజాభిమానాన్ని పొందుకోవాలని చూస్తుంది. ఇటువంటి క్రమంలో భారత మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ధోని కి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.
 
అయితే స్ట్రైట్ గా కాకుండా బిజెపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ధోని రాజకీయాల్లోకి రావాలని తెగ ప్రచారం మొదలు పెట్టింది. ఈ ప్రచారంలో ధోనీతో పాటు... కేంద్ర హోం మంత్రి - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రచారానికి తెరలేపింది బిజెపి సోషల్ మీడియా. ముఖ్యంగా రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి పార్టీ గెలుపును టార్గెట్ గా చేసుకుని వ్యూహాలు పన్నుతున్నట్లు అర్థమవుతుంది. ధోనీ ది జార్ఖండ్ రాష్ట్రం కాబట్టి...ధోనీని జార్ఖండ్ ఎన్నికల్లో వాడుకుని... ఆ వెంటనే రాజ్యసభకు నామినేట్ చేసే పదవిని బీజేపీ హై కమాండ్ ధోనీ కి ఆఫర్ చేసినట్లు సమాచారం.
Top