ఒక్కటైపోయిన వైకాపా - టీడీపీ?

Written By Siddhu Manchikanti | Updated: July 09, 2019 11:52 IST
ఒక్కటైపోయిన వైకాపా - టీడీపీ?

ఒక్కటైపోయిన వైకాపా - టీడీపీ?
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ దక్షిణాది భారతదేశంలో చాలా బలమైన పార్టీలో ఎదగాలని చూస్తోంది. దక్షిణాదిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న క్రమంలో బిజెపి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేకుండా చేస్తున్న బీజేపీ ఎలాగైనా వైసిపి పార్టీని దెబ్బ కొట్టి రాబోయే ఎన్నికల లోపు ఆంధ్రప్రదేశ్లో కాషాయ జెండా ఎగరవేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి శత్రువైన బీజేపీని జగన్ అయినా అటు చంద్రబాబు అయినా ఎదుర్కోవడం ఎలా అనే దానిపైనే సీరియస్ గా దృష్టిపెడుతున్నారట.. బీజేపీ బలపడితే టీడీపీకి - వైసీపీ కి కూడా నష్టమే. అందుకే బలపడనీయకుండా నేతలను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ నుంచి ఫిరాయింపులను పోత్సహించకపోవడం కూడా చంద్రబాబుకు శ్రీరామరక్ష అవుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు బలహీన బీజేపీలోకి పోకుండా బాబు కాపాడుకుంటున్నారు. ఉమ్మడి శత్రువైన బీజేపీని రాష్ట్రంలో ఎంటర్ కాకుండా చేయడంలో జగన్ తోడ్పాటు బాబుకు ఉందనడానికి ఈ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడమే కారణం అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Top