వై ఎస్ జయంతి ని లైట్ తీసుకున్న సాక్షి మీడియా?

Written By Siddhu Manchikanti | Updated: July 09, 2019 11:58 IST
వై ఎస్ జయంతి ని లైట్ తీసుకున్న సాక్షి మీడియా?

వై ఎస్ జయంతి ని లైట్ తీసుకున్న సాక్షి మీడియా ?
 
వైయస్ కుటుంబం సొంత మీడియా సాక్షి లో ఇటీవల దివంగత వైఎస్ 70 వ జయంతి సందర్భంగా సాక్షి మీడియా లో ఎటువంటి కార్యక్రమము ప్రత్యేకంగా జరపకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోపక్క రాష్ట్ర నలుమూలల వైఎస్ జయంతి సంబరాలను కవర్ చేసిన సాక్షి...సొంత మీడియా ఆఫీసుల్లో ఎక్కడా కూడా వైఎస్ జయంతి కి సంబంధించిన సంబరాలు ఏమి జరపలేదు.
 
ఈ విషయాన్ని సాక్షి ఉద్యోగుల ద్వారానే బయటకు పొక్కింది. వైఎస్ జయంతి సందర్భంగా సాక్షి మేనేజ్ మెంట్ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమమూ నిర్వహించింది లేదని సమాచారం. ఆఫీసుల్లో అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలనూ అధికారికంగా నిర్వహించలేదట.ఒకవైపు సాక్షి పత్రిక లోగోలో - టీవీ లోగోలో అనునిత్యం వైఎస్ ఫొటోను వాడుతూ ఉంటారు. జయంతి - వర్ధంతికి ప్రత్యేక సంచికలకూ లోటు లేదు. అయితే ఆఫీసులో మాత్రం చిన్న నివాళి కార్యక్రమం కూడా లేదట. ఇలాంటివి అన్నీ వైఎస్ జగనో - వైఎస్ భారతీనో ఆదేశించి జరపలేరు. దగ్గరుండి చూసుకోవాల్సిన ఆఫీస్ మేనేజర్లు మాత్రం తమకు సంబంధంలేని వ్యవహారం అన్నట్టుగా ఉండిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని సాక్షి సిబ్బంది అనుకుంటున్నారట!
Top