పశ్చిమ బెంగాల్ లో చేసినట్లు తెలంగాణాలో చేస్తే బిజెపిని మట్టు పెడతాం…!

Written By Siddhu Manchikanti | Updated: July 09, 2019 12:05 IST
పశ్చిమ బెంగాల్ లో చేసినట్లు తెలంగాణాలో చేస్తే బిజెపిని మట్టు పెడతాం…!

పశ్చిమ బెంగాల్ లో చేసినట్లు తెలంగాణాలో చేస్తే బిజెపిని మట్టు పెడతాం…!
 
పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కి మరియు బిజెపి పార్టీ కార్యకర్తలకి మధ్య దాడులు ప్రతి దాడులు అనేక వివాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా... టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అటువంటి ప్రయత్నాలకు రెడీ అవుతుందని ఆరోపించారు.
 
పశ్చిమబెంగాల్ లో మాదిరి ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నారని, ఉద్యమకారులుగా తాము చూస్తూ ఊర్కోమని ఎంపీ వినోద్ హెచ్చరించారు. బీజేపీ హింసను ప్రేరేపిస్తే, శాంతిని కోరుకునే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే బెంగాల్‌లాగా తెలంగాణను చేస్తామనడాన్ని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణకు నెలకోసారి వస్తానని వీధి పోరాటాలు చేస్తానని అమిత్‌ షా అంటున్నారని, వీధి పోరాటాలు కాకుండా తాము సైద్ధాంతిక పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Top