జనసేన మీద విష ప్రచారం?

జనసేన మీద విష ప్రచారం?

జనసేన మీద విష ప్రచారం?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి దిగజారిపోతున్న క్రమంలో మరోపక్క జనసేన పార్టీ ఎదుగుతున్న నేపథ్యంలో టీడీపీ కి మద్దతుగా ఉండే ఎల్లో మీడియా జనసేన పార్టీ పై విష ప్రచారానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది.
 
ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయింది తెలుగు దేశమని చివరాకరికి తేలడంతో ఇప్పుడు టీడీపీకి మద్దతు గా ఉండే ఎల్లో మీడియా మరోసారి జనసేన పార్టీను ప్రజల్లో చెడుగా చిత్రీకరించేందుకు పూనుకున్నారు. ఎవరో ఏదో హత్య చేస్తే ఆ హత్యకు జనసేన పార్టీ నేతకు సంబంధం ఉంది అంటూ ఒక న్యూస్ ఛానెల్ వారు ప్రచారం చెయ్యడంతో జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తి జనసేన పార్టీకు చెందిన వాడు కాదని వైసీపీ పార్టీకు చెందిన వ్యక్తి అని సాక్ష్యాలు చూపించి మరీ ఇక నుంచి అయినా జనసేనపై విష ప్రచారాలు మానుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు.Top