'నా దగ్గర ఆ ప్రశ్న కి సమాధానం లేదు' ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు - జనం నమ్మలేకపోయారు!

Written By Siddhu Manchikanti | Updated: July 10, 2019 11:50 IST
'నా దగ్గర ఆ ప్రశ్న కి సమాధానం లేదు' ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు - జనం నమ్మలేకపోయారు!

'నా దగ్గర ఆ ప్రశ్న కి సమాధానం లేదు' ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు - జనం నమ్మలేకపోయారు!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన క్రమంలో భవిష్యత్తులో టీడీపీ ఇక కోరుకునే ప్రసక్తే లేదు అన్న సమయంలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను ఓదార్చడానికి ఒకతాటిపై తీసుకురావడానికి ఇటీవల సంచలన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అంతేకాకుండా వృద్ధాప్య పింఛన్ల విషయంలో ముందుగా వెయ్యి పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కానీ జగన్ తానే పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరియు అదే విధంగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ...ఎక్కడికి వెళ్లిన ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెబుతున్నారని... తాము వేసిన ఓట్లు ఎటు వెళ్లిపోయాయ‌నే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌నీ, ఆ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ "నా దగ్గర ఆ ప్రశ్న కి సమాధానం లేదు" ఓపెన్ గా చెప్పేశారు చంద్రబాబు దీంతో జనం నమ్మలేకపోయారు.
Top