ఆరింటికి మందు దుకాణాలు బంద్!

Written By Siddhu Manchikanti | Updated: July 10, 2019 11:54 IST
ఆరింటికి మందు దుకాణాలు బంద్!

ఆరింటికి మందు దుకాణాలు బంద్!
 
ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన తర్వాత పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మరియు అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్ పాదయాత్ర సమయంలో చాలా చోట్ల చాలా జిల్లాలలో గ్రామాలలో మహిళలు తమ భర్తలు తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని..అలాగే బెల్టుషాపులు ఎక్కడపడితే అక్కడ నిర్మిస్తూ మా భర్తలు కష్టాన్ని దోచుకుంటున్నాయని...మేము పస్తులు ఉండవలసి వస్తుంది అంటూ జగన్ కి పాదయాత్రలో చాలా చోట్ల మహిళలు తమ బాధను వెల్లడించడంతో...జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మద్యం షాపులు ఉండకుండా రానున్న రోజుల్లో మద్యం అనేది కేవలం ఫైవ్ స్టార్ హోటల్ కే పరిమితం చేసే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది.
 
ఈ క్రమంలో తాజాగా జగన్ గ్రామాలలో బెల్టుషాపులు లేకుండానే చేస్తూ మరో పక్క సాయంత్రం 6 గంటల వరకే మద్యం షాపులు ఉండాలనే కొత్త రూల్ పాస్ చేశారు. సాయంత్రం 6 తర్వాత మందు దుకాణాలు ఉండకూడదని బంద్ చేయాలని జగన్ కొత్త రూల్ పాస్ చేయడంతో రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతగానో సంతోషిస్తున్నారు.
Top