జగన్ ఇప్పుడు కొత్త టార్గెట్ రాధా కృష్ణ!

Written By Siddhu Manchikanti | Updated: July 10, 2019 12:00 IST
జగన్ ఇప్పుడు కొత్త టార్గెట్ రాధా కృష్ణ!

జగన్ ఇప్పుడు కొత్త టార్గెట్ రాధా కృష్ణ!
 
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి జగన్ వచ్చిన నాటి నుండి జగన్ వ్యక్తిత్వంపై మరియు జగన్ కుటుంబం పై సమయం దొరికినప్పుడల్లా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని చాలామంది వైసిపి పార్టీకి చెందిన నాయకులు మరియు అదే విధంగా జగన్ కూడా భారీ బహిరంగ సభలో చెప్పటం జరిగింది. ముఖ్యంగా పలు వీడియో సమావేశాలలో కూడా జగన్ నేరుగా ఏబీఎన్ చానల్ గురించి ప్రస్తావిస్తూ నా మీడియా సమావేశాలకు మీ ఛానల్ వారు రావద్దని చాలా సార్లు చెప్పాను అంటూ బహిరంగంగానే ఏబీఎన్ పై జగన్ సీఎం అవ్వడం జరిగింది.
 
అయితే ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయినా కానీ ఏబీఎన్ ఛానల్ తన ధోరణి మార్చుకోకుండా ఏదో విధంగా జగన్ పై బురదజల్లే కార్యక్రమాలు ప్రచారం చేస్తూనే ఉంది. జగన్ ఒక క్రిస్టియన్ అని ప్రజలకు వింతగా చూపించే కార్యక్రమాలు ఇటీవల మొదలుపెట్టింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి మరియు జగన్ కి మధ్య వివాదాలు సృష్టించే విధంగా ఈ మధ్య కొన్ని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో పరిస్థితి చేయి దాచి పోయే స్థితికి రావడంతో జగన్ ఏబీఎన్ రాధాకృష్ణ ని టార్గెట్ చేసినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళితే తాజాగా తన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దివంగత వైఎస్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఎత్తున తొలిసారి ప్రకటనలు గుప్పించారు. అయితే ఒక్క ఆంధ్రజ్యోతిని మినహాయించి... అన్ని మీడియా సంస్థలకు ఈ ప్రకటన ఇవ్వడం ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది.
Top