ఈ స్లయిడ్ షో కి చంద్రబాబు దగ్గర ఆన్సర్ ఉందా?

Written By Siddhu Manchikanti | Updated: July 12, 2019 10:55 IST
ఈ స్లయిడ్ షో కి చంద్రబాబు దగ్గర ఆన్సర్ ఉందా?

ఈ స్లయిడ్ షో కి చంద్రబాబు దగ్గర ఆన్సర్ ఉందా?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మొట్ట మొదటి రోజు ఏపీ నూతన సీఎం జగన్ అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. గతంలో అసెంబ్లీలో ఏదైనా పాయింట్లపై మాట్లాడాల్సి వస్తే వాటికి సంబంధించిన ఆధారాలను ప్రిపేర్ చేసుకుని సభలోకి వచ్చేవారు..ఇదే క్రమంలో ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లను అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు పంచేవారు. అయితే తాజాగా సభలో స్లైడ్ షో సిస్టం ప్రవేశపెట్టారు జగన్. గత సభల కంటే చాలా క్లారిటీగా స్లైడ్ షో ద్వారా ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో బయట పెడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో..విత్తనాల కొరత, ఇన్ పుట్ సబ్సిడీ సమస్యలను ప్రస్తావించే సమయంలో జగన్ స్లైడ్ షోలను వాడుకున్నారు. విత్తనాల కొరత సమస్య గత ప్రభుత్వ పాపం అని, తాము అధికారంలోకి రాక మునుపే విత్తనాల పంపిణీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉండాల్సిందని, టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసిందీ ఆధారాలతో సహా సభలో ప్రవేశపెట్టారు.
 
ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. రైతు రుణమాఫీ పేరుతో చంద్రబాబు అన్నదాతల్ని ఎలా వంచించారో వీడియో క్లిప్ చూపించారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ స్లైడ్ షో ని చుస్తు ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో రావడంతో...చంద్రబాబు గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ గారు నీ మీద ప్రసారం చేసిన స్లైడ్ షో కి ఆన్సర్ ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మొత్తంమీద చూసుకుంటే తొలిసారిగా జగన్, బాబు అబద్ధాలను ఆధారాలతో సహా సభలో చూపెట్టేసరికి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ కావాలో కూడా బాబుకి తెలియలేదు. దీంతో స్లైడ్ షో టెక్నాలజీతో చంద్రబాబుని ఓ ఆటాడేసుకున్నారు జగన్.
Top