చంద్రబాబు ఓదార్పు యాత్ర మీద విమర్శలు!

Written By Siddhu Manchikanti | Updated: July 12, 2019 11:07 IST
చంద్రబాబు ఓదార్పు యాత్ర మీద విమర్శలు!

చంద్రబాబు ఓదార్పు యాత్ర మీద విమర్శలు!
 
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు... తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం తో కొద్దిలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం కూడా కోల్పోయే స్థాయికి దిగజారి పోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సభ్యులు టీడీపీ లో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇతర పార్టీల వైపు చూస్తున్న క్రమంలో... ఇదే సమయంలో పార్టీ పై తన పట్టు కోల్పోతున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న ఓదార్పు యాత్ర పై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క వచ్చిన ఓటమి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ధైర్య పరచడానికి ఉత్సాహం నింపడానికి చంద్రబాబు మొదలుపెట్టిన ఈ యాత్రలో చంద్రబాబు వ్యవహారం పై విమర్శలు రావడం మొదలుపెట్టాయి.
 
ఎందుకంటే కేవలం ఈ యాత్రలో చంద్రబాబు కొంత మందిని మాత్రమే బుజ్జగిస్తున్నారని, మరికొందరి విషయంలో పోతే పోనీ అనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ నేతలకు క్షేత్ర స్థాయిలో బాగా పట్టు ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు బీజేపీ వైపు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ మీదే భారమంతా వేసి తమ బలం ఏమి లేకుండా కేవలం పార్టీ ఇమేజ్‌తో గెలిచే నాయకులు పార్టీ మారాలని తన దృష్టికి వచ్చినా వారిని ఏ మాత్రం అడ్డుకోకుండా వదిలేయాలని చంద్రబాబు ఆలోచనట. ఒకవేళ వారు వెళ్లినా వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రొత్సాహించాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బాబు మొదలెట్టిన ఓదార్పు యాత్రలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటంతో టీడీపీలో అంతర్గతంగా బాబు పై విమర్శలు వస్తున్నాయి.
Top