కెసినేని నాని అడుగులు ఎటు పడుతున్నాయి!

Written By Siddhu Manchikanti | Updated: July 12, 2019 11:12 IST
కెసినేని నాని అడుగులు ఎటు పడుతున్నాయి!

కెసినేని నాని అడుగులు ఎటు పడుతున్నాయి!
 
2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ బంపర్ మెజార్టీ తో జగన్ ఇమేజ్ తో గెలిచిన సమయంలో... దాదాపు 22 పార్లమెంటు స్థానాలను గెలిచిన సమయంలో... జగన్ గాలిని తట్టుకొని విజయవాడ పార్లమెంటు స్థానం నుండి రెండోసారి తెలుగుదేశం పార్టీ నుండి కేశినేని నాని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇదే క్రమంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారిపోవడానికి టీడీపీ లో ఉన్న నాయకులే కారణం అంటూ సోషల్ మీడియాలో కొత్త కొత్త పోస్టులతో తన యొక్క సహనాన్ని వెళ్లగక్కడం తో టీడీపీలో కేసినేని నాని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు.
 
ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఉండదని బీజేపీ పార్టీలో చేరాయి టిడిపిలో పెద్ద పెద్ద తలకాయలు. తాజాగా... కేసినేని నాని కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఏపీ మరీ జాతీయ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల విజయవాడ ఎంపీగా గెలిచిన సమయంలో కేశినేని నాని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. మొత్తంమీద కేసినేని నాని వ్యవహారం బీజేపీతో సఖ్యతగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే కేసినేని నాని బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చాలా మంది రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క బిజెపి చేసిందని నానికి ఇటీవల ఒక కీలకమైన కమిటీ సభ్యునిగా నామినేట్ చేయడంతో... వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
Top