కేంద్రం లో తెలుగోళ్ళకి కీలక బాధ్యతలు?

Written By Siddhu Manchikanti | Updated: July 12, 2019 11:20 IST
కేంద్రం లో తెలుగోళ్ళకి కీలక బాధ్యతలు?

కేంద్రం లో తెలుగోళ్ళకి కీలక బాధ్యతలు?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ విస్తరించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఎలాగైనా దక్షిణాది రాజకీయాల్లో బలమైన పార్టీగా ఆవిష్కృతం అవ్వాలని చూస్తుంది. కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే దక్షిణాదిలో బలంగా ఉన్న బిజెపి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవులు అప్పజెప్పింది. పార్లమెంట్‌లోని ఎస్టిమేట్ కమిటీ సభ్యుల పదవులకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 31 మంది ఎంపీలు నామొనేషన్లు వేశారు. అయితే అందులో ఇద్దరు ఎంపీలు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.
 
అయితే ఈ పదవులలో కేంద్ర ప్రభుత్వం ఏపీ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం కల్పించగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి అవకాశం కల్పించారు. అయితే ఈ కమిటీలో ఉన్న సభ్యులు కేంద్రం యొక్క వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలన చేసుకుని వార్షిక వ్యయంలో పొదుపు అంశాలపై ప్రభుత్వానికి తమవంతు సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. మొత్తం మీద కేంద్రం లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు వాళ్లపై గట్టిగానే గురు పెట్టినట్లు అర్థం అవుతోంది.
Top