పంజాబ్ రాష్ట్రంలో గల్లంతు అవుతున్న కాంగ్రెస్ పార్టీ..?

Written By Siddhu Manchikanti | Updated: July 14, 2019 15:51 IST
పంజాబ్ రాష్ట్రంలో గల్లంతు అవుతున్న కాంగ్రెస్ పార్టీ..?

పంజాబ్ రాష్ట్రంలో గల్లంతు అవుతున్న కాంగ్రెస్ పార్టీ..?
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికలలో కూడా దేశ ప్రజల మన్నలను అందుకోలేకపోయింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి బాధ్యత వహిస్తూ ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇటువంటి పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న నాయకులు తమ భవిష్యత్తు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. దీంతో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు దాపరించాయి. కర్నాటక లో కాంగ్రెస్ ,జెడిఎస్ కూటమి లో సంక్షోభం పరిష్కారం కాకముందే పంజాబ్ కాంగ్రెస్ కుంపటి మొదలైనట్లుగా ఉంది. అక్కడ ప్రముఖ క్రికెటర్ గా ఉండి రాజకీయాలలోకి వచ్చిన మంత్రి నవజోత్ సిద్దూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన లేఖను ట్విటర్ లో పెట్టారు. ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తో ఆయనకు గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.సిద్దూ శాఖను కూడా ముఖ్యమంత్రి మార్చడం వివాదం అయింది.ఈ విషయాలపై రాహుల్ గాందీ వద్ద సిద్దూ పంచాయతీ కూడా పెట్టారు.అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు.అది ఏ రూపం దాల్చుతుందన్న ఉత్కంఠ ఏర్పడింది.
Top