జగన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది !

జగన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది !

జగన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది !
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ల పై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎలా పడితే అలా గా ప్రభుత్వ అనుమతి లేకుండా అవినీతి సొమ్ము సంపాదించడం జరిగింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక విధానం...ఇసుక సరఫరాల్లో దళారుల ప్రసక్తే లేకుండా నేరుగా వినియోగదారుడే ఆన్ లైన్లో ఇసుక కోసం ఆర్డర్ ఇచ్చేలా ఇసుక విధానాన్ని సులభతరం చేశారు. అయితే నూతన విధానం పట్టాలెక్కడానికి ఇంకా నెలన్నరకు పైగానే సమయం ఉంది. అయితే ఈ సంధి కాలంలోనే ప్రభుత్వానికి నష్టం జరిగేలా ఉంది.
 
ప్రస్తుతం అమల్లోకి వచ్చిన విధానం ఫ్లాప్ అయితే జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. నిర్ణయం ఎంత మంచిదైనా అమలు విధానం బాగుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే జగన్ సర్కార్ ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. గృహ నిర్మాణ అవసరాల కోసం ఇసుక కావాల్సినవారు అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అనుమతి విధానంపై ప్రజల్లో అవగాహన లేదు. ఇక్కడే దళారీలు రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పై మచ్చ పడే అవకాశం ఉండటంతో ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.Top