చచ్చిన పామునే చంపుతున్న కెసినేని నాని !

Written By Siddhu Manchikanti | Updated: July 15, 2019 16:15 IST
చచ్చిన పామునే చంపుతున్న కెసినేని నాని !

చచ్చిన పామునే చంపుతున్న కెసినేని నాని !
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఆంధ్ర ప్రజలు ఓడించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితికి దారుణంగా మారిపోయింది. పార్టీలో ఉన్న నాయకులే చంద్రబాబుపై ఆయన గతంలో వ్యవహరించిన తీరుపై పరోక్షంగా మండిపడుతున్నారు. అయితే మరోపక్క విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అయితే నేరుగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాటి నుండి తెలుగుదేశం పార్టీ పైనే మరి ఆ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన నాయకుల పైన సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని షాకింగ్ కామెంట్ లు పెడితే ఏపీ రాజకీయాలు వేడెక్కిస్తున్న కేశినేని నాని ఇటీవల ట్విట్టర్ సాక్షిగా చంద్రబాబు పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేశారు.
 
ఇంతకీ కేశినేని నాని చేసిన కామెంట్ ఏమిటంటే.."నేను టిడిపిలో ఉండాలని మీరు అనుకోకపోతే, బహిరంగంగా చెప్పండి. నేను టిడిపి మరియు ఎంపి పదవి నుండి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పార్టీలో కొనసాగాలని కోరుకుంటే, మీ పెంపుడు కుక్కలను అదుపులోకి పెట్టుకోండి” అంటూ హితవు పలికారు. దీంతో కేశినేని నాని చేసిన ట్వీట్ పై చాలా మంది చచ్చిన పాముని ఎందుకు చంపుతావు అంటూ...పార్టీలో ఉన్న పరిస్థితి బట్టి చంద్రబాబు చచ్చిపోయినా పాము లాగా ఉన్నారని ఆయనపై ఇలా మాట్లాడటం మంచిది కాదని టిడిపి మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు.
 
Top