మూర్ఖత్వం అంటే ఇదేనేమో .. రెండేళ్ల పాప తో బిల్డింగ్ మీద నుంచి దూకెసింది !

Advertisement

by Siddhu Manchikanti | July 15, 2019 16:25 IST
Follow Xappie
మూర్ఖత్వం అంటే ఇదేనేమో .. రెండేళ్ల పాప తో బిల్డింగ్ మీద నుంచి దూకెసింది !

మూర్ఖత్వం అంటే ఇదేనేమో .. రెండేళ్ల పాప తో బిల్డింగ్ మీద నుంచి దూకెసింది !
 
ప్రస్తుతం సమాజంలో ఉన్న మనుషుల ప్రవర్తిస్తున్న తీరు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ చిన్న వయసులోనే చావుకి దగ్గరవుతున్నారు యువత. మరోపక్క వయసు మీద పడినా వృద్ధులు వావి వరుస లేకుండా ఎవరితో పడితే వారితో వ్యభిచరిస్తూ వార్తల్లో నిలుస్తూ మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే క్రమంలో పెళ్లయిన ఆడవాళ్ళు అయితే ఎక్కువ శాతం అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను కూడా చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఆడవాళ్లు అయితే మూర్ఖంగా ప్రవర్తిస్తూ నవమాసాలు మోసిన పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలాగే తాజాగా మూర్ఖంగా ప్రవర్తించిన ఒక ఆమె రెండేళ్ల పాప తో బిల్డింగ్ మీద నుంచి దూకెసింది. వివరాల్లోకి వెళితే సిరిసిల్లకు చెందిన 33 ఏళ్ల పద్మజకు 2006లో రామ్మోహన్ తో వివాహమైంది.
 
వీరికి ఇద్దరు పిల్లలు. వీరు కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఉంటున్నారు. రామ్మోహన్ ఈవెంట్స్ చేస్తుండగా.. భార్య అతడు చేసే కార్యక్రమాలకు తోడుగా నిలిచేది. అయితే వ్యాపారాలలో కొన్నాళ్లకు నష్టం వచ్చి అప్పుల పాలవడంతో..అప్పుల విషయమై భార్యభర్తల మధ్య పెరిగిన మాటలు శ్రుతిమించి గొడవగా మారింది. దీంతో భర్త బెడ్రూంలోకి వెళ్లిపోగా.. పద్మజ మాత్రం తన రెండేళ్ల చిన్నారిని పట్టుకొని బాల్కని నుంచి కిందకు దూకేశారు. నాలుగో అంతస్తు నుంచి చోటు చేసుకున్న ఈ వైనంతో పెద్ద శబ్దంరావటంతో బయటకొచ్చి చూడగా.. భార్య పై నుంచి దూకేసిన వైనాన్ని గుర్తించారు. పరుగు పరుగున కిందకు వెళ్లిన రామ్మోహన్.. ఆమెను.. కుమార్తెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లుగా పేర్కొన్నారు. రెండేళ్ల చిన్నారి మాత్రం గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉంది. దీన్ని చూసిన అక్కడ స్థానికులు తీవ్ర కలత చెందారు.


Advertisement


Advertisement

Top