జగన్ మోహన్ రెడ్డి కోసం పోటీ పడుతున్నారు!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 15:36 IST
జగన్ మోహన్ రెడ్డి కోసం పోటీ పడుతున్నారు!

జగన్ మోహన్ రెడ్డి కోసం పోటీ పడుతున్నారు!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలో అత్యంత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అధినేత జగన్ అతి తక్కువ కాలంలోనే ప్రజల యొక్క ఆశీస్సులను అందుకుంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ తన పాలన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికలలో కేవలం జగన్ మొహం చూసి... చాలామంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల లో పాల్గొన్న అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ని ఇంప్రెస్స్ చేయడానికి పార్టీలో ఉన్న మంత్రులు మరియు ఎమ్మెల్యేలు... ఎంపీలు జగన్ కోసం తెగ పోటీ పడుతున్నారు.
 
ఇదిలా ఉండగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కూడా చాలామంది ఇదే రీతిలో వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. అయితే మరోపక్క ముఖ్యమంత్రి జగన్ మాత్రం...ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నైనా అవినీతి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని నన్ను కాదు మీ మీ నియోజకవర్గాలలో మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల సరైన ఆదరణ పొందాలని నా ముందు కాదు వారి ముందు... మీ పనితనాన్ని చూపించాలని తన ముందు ఓవర్ చేస్తున్న కొంతమంది నేతలకు జగన్ గట్టిగా సూచించినట్లు సమాచారం.
Top