బాబు చేసే పనికి బీజేపీ ఫుల్ ఖుషీ!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 15:44 IST
 బాబు చేసే పనికి బీజేపీ ఫుల్ ఖుషీ!

బాబు చేసే పనికి బీజేపీ ఫుల్ ఖుషీ!
 
టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై ఎలా మాట్లాడాలో తెలియక 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ పాడిన పాట పాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే తలనొప్పిగా మారిపోయారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో బాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులే పార్టీ ఓటమికి చంద్రబాబు అండ్ కో... మరియు నారా లోకేష్ ఏ కారణము అంటూ సొంత వారే బాబు పై ధ్వజమెత్తుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నారా లోకేష్ పై సెటైర్లు వేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.
 
గతంలో అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ పై ఒక్క మాట కూడా మాట్లాడని బాబు సన్నిహితులు తాజాగా పరోక్షంగా నారా లోకేష్ ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో...మరోపక్క నారా చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా లోకేష్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉండటంతో బాబు చేసే పనికి బీజేపీ ఫుల్ ఖుషీ గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రరాష్ట్రంలో టీడీపీలో జరుగుతున్న పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకోవాలని భారతీయ జనతాపార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలకు భవిష్యత్తుపై భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. రాజకీయ భవితవ్యంపై ఆశలు ఉన్న వారు టీడీపీలో ఉండటానికే ఆసక్తిని చూపడం లేదని జీవీఎల్ మాట్లాడుతూ... ఏపీ టీడీపీ లో ఉన్న నాయకులు రాజకీయ భవిష్యత్ కావాలి అంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
Top