చంద్రబాబు కె తలనొప్పిగా మారిన అచ్చెన్నాయుడు…?

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 15:54 IST
చంద్రబాబు కె తలనొప్పిగా మారిన అచ్చెన్నాయుడు…?

చంద్రబాబు కె తలనొప్పిగా మారిన అచ్చెన్నాయుడు…?
 
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు అసెంబ్లీకి పెద్ద తలనొప్పిగా మారారు అంటూ... సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్ల చేస్తున్నారు. సబ్జెక్టుపై మాట్లాడకుండా సబ్జెక్టుని పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఒక మాట చెప్పించారు. ఒక వివాదంలో స్పీకర్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మీరు రాసిస్తే చదువుతా అని వ్యాఖ్యానించారు.
 
దీనిపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబును ఉద్దేవించి తమ్మినేని ప్రశ్నిస్తూ, మీరు రాసిస్తే నేను చదువుతా అని అచ్చెన్నాయుడు అనడాన్ని సమర్దిస్తారా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడి మాటలను సమర్థించడం లేదని చెప్పక తప్పలేదు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాటలను మీరు సమర్థిస్తారా అంటూ స్పీకర్‌ను అడిగారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే సభ నడిచే పరిస్థితి ఉండదని, సభను హుందాగా నడిపించేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. కాగా అచ్చెన్నాయుడు సంప్రదాయాలు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. స్పీకర్‌ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్ని రోజుల్లో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడే అచ్చం నాయుడు సభలో నాకు తలనొప్పిగా మారారని కామెంట్ చేసినట్లు టిడిపి వర్గాల్లో వినపడుతున్న టాక్.
 
Click Here for Video
Top