పోలీసుల అదుపులో ఎమ్మెల్యే!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 16:00 IST
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే!

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే!
 
కర్ణాటక ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోంజీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను... విమానాశ్రయంలో పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిట్ అధికారులు.. ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నలు వేయడంతో... ఒకసారి ముంబాయి మరొకసారి ఢిల్లీ, పూణే అని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో... ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
 
ఆయన దగ్గర టికెట్ ఆధారంగా చూస్తే పూణే వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐఎంఏ పోంజీ స్కీం కేసులో ఈ నెల 19న తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్. బేగ్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కాకుండా రోషన్ బేగ్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Top