వైకాపా కి బీజేపీ భలే ఎర్త్ పెట్టింది గా!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 16:04 IST
వైకాపా కి బీజేపీ భలే ఎర్త్ పెట్టింది గా!

వైకాపా కి బీజేపీ భలే ఎర్త్ పెట్టింది గా!
 
రెండోసారి మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ పార్టీ పెద్దలు దక్షిణాది రాష్ట్రాలపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఉత్తరాదిలో బీజేపీకి ఎదురులేని నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని... బలమైన వ్యూహాలతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలని టార్గెట్ చేస్తూ బిజెపి వేస్తున్న ప్లాన్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిమ్మతిరిగి పోతున్నాయి. ముఖ్యంగా వైకాపా పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కి అయితే బీజేపీ భలే ఎర్త్ పెట్టింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు... ఒక్కసారిగా బీజేపీ పార్టీ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న క్రమంలో... ఒకపక్క తెలుగుదేశం పార్టీ నేతలను చేర్చుకుంటే మరోపక్క అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన నేతలను కూడా చేర్చుకునె కార్యక్రమం మొదలు పెట్టింది.
 
ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణిని పార్టీలో చేర్చుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీగా దూరంగా ఉంటానని చెప్పి తనకు బదులు తన భార్య తోట వాణికి టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టాన్ని కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో నరసింహం ఆయన భార్యతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆమెకు పెద్దాపురం టికెట్ కూడా దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నీతో ఇప్పుడు తోట వాణి బిజెపి పార్టీలోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Top