వాళ్ళిద్దరి గురించే కే‌సి‌ఆర్ భయం భయం!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 16:14 IST
వాళ్ళిద్దరి గురించే కే‌సి‌ఆర్ భయం భయం!

వాళ్ళిద్దరి గురించే కే‌సి‌ఆర్ భయం భయం!
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికలలో బంపర్ మెజారిటీతో గెలిచిన కేసీఆర్... తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగించలేకపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు కళ్లెం వేశారు... పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎవరు ఊహించని విధంగా బిజెపి పార్టీకి బలంగా పట్టం కట్టడం తో అది కూడా టిఆర్ఎస్ పార్టీ పరంగా బలమైన పార్లమెంటు స్థానాలలో… దీంతో కెసిఆర్ లో భయం నెలకొంది. ముఖ్యంగా బిజెపి పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరి గురించి బాగా భయం పట్టుకున్నట్లు సమాచారం.
 
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన ఇద్దరు యువ ఎంపీ లు...టిఆర్ఎస్ పార్టీ విషయంలో దూకుడుగా వ్యవహరించడంతో పాటుగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఆకర్షించడంతో కెసిఆర్ కి వారిద్దరి గురించి భయం పట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్న టాక్. ఆ ఇద్దరు మరెవరో కాదు నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లు. ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ఆకర్ష్ కార్యక్రమాన్ని అధికార పార్టీపై ప్రయోగించడంతో కేసీఆర్ లో భయం పట్టుకున్నట్లు సమాచారం.
Top