చంద్రబాబుకే విసుగు తెప్పించిన అచ్చం నాయుడు…?

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 16:18 IST
చంద్రబాబుకే విసుగు తెప్పించిన అచ్చం నాయుడు…?

చంద్రబాబుకే విసుగు తెప్పించిన అచ్చం నాయుడు…?
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది. అధికారంలో ఉన్న నేతలు సబ్జెక్టు గురించి మాట్లాడుతుంటే అచ్చెన్నాయుడు మాత్రం సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తూ...వాస్తవాలను గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పక్కదారి పట్టిస్తూ నోరు పారేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మనిషి అడగడం కాదు బుర్ర బుద్ధి కూడా ఎదగాలని జగన్ వేసిన డైలాగ్ లకు మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీలో ఒకానొక సందర్భంలో చంద్రబాబుకి అచ్చెన్నాయుడు విసుగు తెప్పించినట్లు సమాచారం. విషయంలోకి వెళితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఒక మాట చెప్పించారు.
 
ఒక వివాదంలో స్పీకర్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మీరు రాసిస్తే చదువుతా అని వ్యాఖ్యానించారు. దీనిపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు చంద్రబాబును ఉద్దేవించి తమ్మినేని ప్రశ్నిస్తూ, మీరు రాసిస్తే నేను చదువుతా అని అచ్చెన్నాయుడు అనడాన్ని సమర్దిస్తారా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడి మాటలను సమర్థించడం లేదని చెప్పక తప్పలేదు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాటలను మీరు సమర్థిస్తారా అంటూ స్పీకర్‌ను అడిగారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే సభ నడిచే పరిస్థితి ఉండదని, సభను హుందాగా నడిపించేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.కాగా అచ్చెన్నాయుడు సంప్రదాయాలు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. స్పీకర్‌ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్ని రోజుల్లో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో చంద్రబాబుకే అచ్చెన్నాయుడు వ్యవహరించిన తీరుపై విసుగు కలిగి ఉన్నట్లు సమాచారం.
Top