కియా మోటార్స్ పై అధికార పార్టీ చెబుతుంది అంతా అబద్ధం అంటున్న చంద్రబాబు..!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 16:24 IST
కియా మోటార్స్ పై అధికార పార్టీ చెబుతుంది అంతా అబద్ధం అంటున్న చంద్రబాబు..!

కియా మోటార్స్ పై అధికార పార్టీ చెబుతుంది అంతా అబద్ధం అంటున్న చంద్రబాబు..!
 
కియా మోటార్స్ ఫ్యాక్టరీ విషయమై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి కియా మోటర్స్ రావడానికి కారణం నేనే అంటూ నా హయాంలోనే వచ్చిందంటూ ప్రస్తుత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో కామెంట్ చేయడం తో. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి కియా కంపెనీ రావటానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని 2007లోనే ఈ ప్రతిపాదన వైయస్ తీసుకువచ్చారని ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. దీనిపై లేనిపోని అబద్ధాలు చెప్పడం మంచిది కాదు అంటూ చంద్రబాబు పై సెటైర్లు చేశారు.
 
దీంతో ఈ విషయమై ఇటీవల చంద్రబాబునాయుడు పలువురు టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల పనుల్లో పురోగతి లేదన్నారు. పీపీఏలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిని అప్రతిష్టపాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలు టీడీపీ ఇవ్వలేదని జగన్ చెప్పారని.. ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్లేట్ ఫిరాయించారని చంద్రబాబు విమర్శించారు. మొత్తంమీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కియా ఫ్యాక్టరీ గురించి వాదాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
 
Click Here For Video
Top