జీవితాంతం టోల్ డబ్బులు కట్టాల్సిందే నా?

Written By Siddhu Manchikanti | Updated: July 17, 2019 15:46 IST
జీవితాంతం టోల్ డబ్బులు కట్టాల్సిందే నా?

జీవితాంతం టోల్ డబ్బులు కట్టాల్సిందే నా?
 
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాహన దారుల విషయంలో జీవితకాలం టోల్ టాక్స్ కట్టే విధంగా కేంద్ర సర్కార్ మొగ్గు చూపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. ఆయన ఏమన్నారంటే దేశంలో ఉన్న ప్రజలకు మంచి రోడ్లు కావాలంటే కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అని...కేంద్రం దగ్గర డబ్బులు లేనందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని టోల్ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని లోక్‌స‌భ సాక్షిగా నితిన్ గ‌డ్క‌రి సంచ‌ల‌నం సృష్టించారు.
 
దీంతో వాహ‌న దారుల్లో ఆందోళ‌న మొద‌లైంది. మరోపక్క దేశంలోని వివిధా ప్రాంతాల్లో టోల్ ప్లాజాల గ‌డువు తీరినా వాటిని య‌దావిధిగా కొన‌సాగిస్తున్నార‌ని గ‌త కొంత కాలంగా చాలా మంది ఆందోళ చేస్తున్నారు. ఈ విష‌యం మంత్రి నితిన్ గ‌డ్క‌రి ద‌గ్గ‌రికి వెళ్లింది. దీంతో ఆయ‌న పై విధంగా స్పందించి బీజేపీనా మ‌జాకా అన్న రీతిలో వాహ‌న‌ దారుల‌పై బాంబు పేల్చారు. మొత్తంమీద తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు జీవితాంతం టోల్ డబ్బులు కట్టాల్సిందే నా అంటూ బిక్కమొహం పెట్టినట్లు సోషల్ మీడియాలో ఈ వార్తపై కామెంట్లు పెడుతున్నారు.
Top