ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద 'కాస్ట్ ఫీలింగ్' మరక?

Written By Siddhu Manchikanti | Updated: July 17, 2019 15:54 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద 'కాస్ట్ ఫీలింగ్' మరక?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద 'కాస్ట్ ఫీలింగ్' మరక?
 
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా కుల పిచ్చి గల రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అని చాలామంది పొలిటిషియన్స్ కామెంట్లు చేస్తుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో కులాల పరంగానే ఓట్లు పడతాయని..రాజకీయాలు కూడా కులాల ఆధారంగానే జరుగుతాయి అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా టీడీపీ హయాంలో టీడీపీలో బలమైన సామాజిక వర్గం వారే ప్రధానమైన పదవుల్లో ఉండటం ఇందుకు నిదర్శనం. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న సమయంలో... ప్రతిపక్షంలో ఉన్నా వైసిపి పార్టీ పై ప్రధాన పదవుల్లో పోలీస్ శాఖలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులు... వైసీపీ పార్టీకి చెందిన నాయకులను తీవ్ర ఇబ్బందులు పాలు గతంలో చేయడంతో ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో పోస్టింగ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వంపై క్యాస్ట్ ఫీలింగ్ అనే ముద్ర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇక విషయంలోకి వెళితే...వైఎస్ఆర్సిపి పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చాలామంది అంటుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సామాజి వ‌ర్గానికి చెందిన ఐపీఎస్‌లు, డీజీపీలు అణ‌చివేత‌కు గురైతే ఇప్పుడు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ విష‌యంలో వేధింపుల‌కు గుర‌వుతున్నా పోలీస్ డిపార్ట్ మెంట్ కావ‌డంతో జ‌రుగుతున్న విష‌యాన్ని బ‌య‌టికి చెప్ప‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌డం లేద‌ట‌. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న వేధింపుల‌పై డీఎస్పీ స్థాయి అధికారులు స‌న్నిహితంగా వుండే మీడియా వ‌ర్గాల వ‌ద్ద గోడు వెళ్ల‌బోసుకుంటున్నార‌ట‌. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏ రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.
Top