గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉండడం వెనక అయిదొందల కోట్ల లెక్క?

Written By Siddhu Manchikanti | Updated: July 17, 2019 15:59 IST
గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉండడం వెనక అయిదొందల కోట్ల లెక్క?

గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉండడం వెనక అయిదొందల కోట్ల లెక్క?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ పార్టీల మధ్య మాటల తూటాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభలో 23 మంది టిడిపి పార్టీకి చెందిన వారు ఉన్నా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా వైసీపీ పార్టీ పై పోరాడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరు అందరి తీరు ఒకలా ఉంటే...మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీరు మరోలా ఉంది. ఎక్కడా కూడా జరుగుతున్న అసెంబ్లీలో ఆయన నిలబడిన దాఖలాలు లేవు...అలాగే పెద్దగా కూడా అసెంబ్లీ లో కనిపించడం లేదు.
 
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద కథ ఉందని ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే విశాఖ కేంద్రం పెద్ద ఎత్తున భూపందేరం జరిగింది. దాదాపు 500 కోట్లు విలువ చేసే భూముల విషయంలో గంటా తన చేతి వాటం గట్టిగానే చుపించాడనే మాటలు అప్పట్లో వినిపించాయి. దీనిపై సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా ముఖంగానే గంటా మీద ఆరోపణలు చేశాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం ఆనాటి అక్రమల గురించి ఆధారాలతో సహా బయట పెట్టటానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇలాంటి టైములో వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళకి టార్గెట్ అవటం ఎందుకని గంటా సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం.
Top