ఏపీ సీఎం జగన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్..!

ఏపీ సీఎం జగన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్..!

ఏపీ సీఎం జగన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్..!
 
అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ ...తనను నమ్మిన ప్రజలకు కచ్చితంగా న్యాయం చేయాలని ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా వృధా ఖర్చులకు పోకుండా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పాలనా ముందుకు సాగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైఎస్ జగన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. అసలు విషయంలోకి వెళితే విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇటువంటి తరుణంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి సడన్గా ప్రపంచ బ్యాంక్ తప్పుకుంది. 300 మిలియన్ డాలర్ల రుణ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయగా.. దానిని నుంచి తప్పుకున్నట్లు వరల్డ్ బ్యాంక్ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.
 
అమరావతి అభివృద్ధి కోసం 715 డాలర్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా 300 మిలియన్ డాలర్లు మాత్రమే రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైంది.ఈ లోగా అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు.. రాజధాని నిర్మాణం తమ జీవనాధారానికి హని చేస్తోందని.. పర్యావరణానికి, ఆహార భద్రతకు ఇది భంగం కలిగిస్తోందంటూ వారు వరల్డ్ బ్యాంక్ తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రపంచబ్యాంక్ రుణం మంజూరు విషయంలో జాప్యం చేస్తూ వచ్చి.... చివరికి ఏకంగా ప్రాజెక్ట్ నుంచే తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.Top