మోడీ నే దిక్కు అంటున్న వై ఎస్ ఆర్ సి పి….?

Written By Siddhu Manchikanti | Updated: July 20, 2019 14:11 IST
మోడీ నే దిక్కు అంటున్న వై ఎస్ ఆర్ సి పి….?

మోడీ నే దిక్కు అంటున్న వై ఎస్ ఆర్ సి పి….?
 
విభజనతో నష్టపోయి... అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పాలకులు ఖాళీ ఖజానా చేతిలో పెట్టి ... వెళ్లిపోవడంతో రాష్ట్రంలో సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని చేయాలని పరితపిస్తున్న వైసిపి ప్రభుత్వం ఇప్పుడు మోడీ నే దిక్కు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పైనే వారు ఇచ్చే నిధుల పైనే ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో వరల్డ్ బ్యాంక్ కూడా ప్రక్కకు తప్పుకోవడంతో... ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని వెంటనే నిధులు విడుదల చేసి... రాష్ట్రాన్ని ఆదుకోవాలని అన్నట్టుగా... వైసిపి పార్టీ ప్రభుత్వం కేంద్రం దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
 
ఎన్నో కలలు కానీ అధికారంలోకి వచ్చిన జగన్ కి ప్రస్తుత రాష్ట్రం పరిస్థితి బట్టి చూస్తే ఇది ఒక అగ్ని పరీక్ష అని... నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీ అయిపోయిన ఖజానాలో జగన్ ఏ విధంగా పరిపాలన చేస్తారోనని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఏ మాత్రం ఏపీ సీఎం జగన్ నిరుత్సాహపడకుండా పాలన విషయంలో అభివృద్ధి విషయంలో తన పంథాలో నిర్ణయాలు తీసుకుంటూ మరోపక్క కేంద్రం దగ్గర ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఉన్న పరిస్థితి చూస్తుంటే మోడీని దిక్కు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం పట్ల కనికరం చూపిస్తుందో లేదో చూడాలి.
Top