జగన్ కొద్దిగా తగ్గాలి బిజెపి హైకమాండ్ సీరియస్ వార్నింగ్…?

Written By Siddhu Manchikanti | Updated: July 20, 2019 14:16 IST
జగన్  కొద్దిగా తగ్గాలి బిజెపి హైకమాండ్ సీరియస్ వార్నింగ్…?

జగన్ కొద్దిగా తగ్గాలి బిజెపి హైకమాండ్ సీరియస్ వార్నింగ్…?
 
ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో సాధించాలనే దిశగా ఉన్న జగన్ ఆశలకు బిజెపి హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో న్యాయబద్ధంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యం వహించి రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీశారని వైసీపీ పార్టీకి చెందిన నేతలు మరియు జగన్ గత ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొట్టారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలాగైనా ప్రత్యేక హోదా అనే హక్కుని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న మొదటిలోనే... రెండోసారి కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ఆంధ్ర రాష్ట్రం పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇందుమూలంగా నే ఇటీవల రాష్ట్ర బిజెపి నాయకురాలు పురందేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో షాకింగ్ కామెంట్ చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని.. దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకోవాలని సూచించారు.
 
ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని.. హోదాను పక్కనపెట్టి వాటిని తీసుకోవాలని జగన్ కు సూచించారు పురంధేశ్వరి. చంద్రబాబు సైతం మొదట్లో ప్యాకేజీకి ఓకే అని ఆ తరువాత రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీని అభాసుపాలు చేశారని... జగన్ కూడా ఇప్పుడు హోదా కోసం ఆయన బాటలోనే నడుస్తూ పెద్ద తప్పు చేస్తున్నారని పురంధేశ్వరి హెచ్చరించారు. దీంతో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యల పట్ల చాలా ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు.
Top