రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కొత్త నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం…!

Written By Siddhu Manchikanti | Updated: July 20, 2019 14:23 IST
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కొత్త నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం…!

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కొత్త నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం…!
 
ఏపీ కి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి ప్రతిక్షణం ఆలోచిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..ఇటీవల గ్రామ వాలింటర్..ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో త్వరలోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు విషయాలలో గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిబద్ధతతో రాష్ట్ర యువతకు మేలు చేకూరే విధంగా కొత్త అడుగులకు తాజాగా శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం.
 
ఇక అసలు విషయంలోకి వెళితే..గత ప్రభుత్వం అమలు చేసిన ఎపి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును రద్దు చేసి కొత్త వ్యవస్తను తీసుకు రావాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.దీనికి ఎపి ఐపిఎమ్ ఎ అని పేరు పెట్టారు. అంటే ఏపీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌, మానిటరింగ్‌ యాక్ట్‌(ఏపీఐపీఎంఏ)కు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్‌, ప్రాజెక్టులకు అనుమతి, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం ఛైర్మన్‌గా, ఏడుగురు డైరెక్టర్లతో ఏపీఐపీఎంఏ బోర్డును నియమించనున్నారు. డైరెక్టర్లలో ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రులు, సీఎస్‌ ఉండనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఏపీ సీఎం జగన్ ఆలోచించినట్లు సమాచారం.
Top