పోలవరం అంటే భయపడుతున్న టీడీపీ..?

పోలవరం అంటే భయపడుతున్న టీడీపీ..?

పోలవరం అంటే భయపడుతున్న టీడీపీ..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు గురించి జరుగుతున్న చర్చల పర్వంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో భయంకరమైన అవినీతికి పాల్పడ్డారని..ఇటీవల ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో షాకింగ్ కామెంట్ చేశారు. ఇదే తరుణంలో అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పోలవరంపై చర్చ జరగకూడదని టీడీపీ భావిస్తోందన్నారు.
 
పోలవరం అంటే టిడిపి భయపడి పోతుందని పేర్కొన్నారు. ఎక్కడ తాము చేసిన అవినీతి బయట పడుతుందోనని టీడీపీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. శాసనసభను పోలవరం పేరుతో టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని సీఎం శాసనసభలో చెప్పారని ఆయన వివరించారు. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే.. గత టీడీపీ ప్రభుత్వం స్వార్ధం కోసం వారి చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. పోలవరంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని.. 15 రోజులో ఆ కమిటీ నివేదిక ఇవ్వనుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టనున్నారని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.


Tags :


Top