బీజేపీలోకి వైసీపీ పార్టీ నాయకులు..?

Written By Siddhu Manchikanti | Updated: July 20, 2019 14:37 IST
బీజేపీలోకి వైసీపీ పార్టీ నాయకులు..?

బీజేపీలోకి వైసీపీ పార్టీ నాయకులు..?
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు బిజెపి పార్టీలో చేరిన సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న నేతలు కూడా బిజెపి పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం సంపాదించిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాతుకు పోవాలని పార్టీ కార్యక్రమాలు విస్తరింపజేయాలని..తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రస్తుతం ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది. ఎప్పటికీ ఏపీలో బిజెపి ఆయా నేతలను ఆకర్షించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.
 
ఆ పార్టీ ఎమ్మెల్సీ మాదవ్ మీడియాకు చెప్పిన విషయాలు కొన్ని ఆశ్చర్యంగానే ఉన్నాయి. కొందరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముఖ్యులు కూడా బిజెపితో టచ్ లో ఉన్నారని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఆయన చెప్పారు.ఆయనతోపాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ , అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా బిజెపిలో టచ్ లో ఉన్నారని చెప్పారట. ఒక ఆంగ్ల పత్రిక ఈ విషయం రాసింది. ఇందులో ఎంత నిజం ఉందన్నది సందేహం. ఎందుకంటే బొత్స ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అలాగే ధర్మాన సోదరుడు మంత్రిగా ఉన్నారు. వారు టచ్ లో ఉన్నారని మాదవ్ ఎందుకు చెప్పారో. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో మరియు వైసీపీ పార్టీలో కలకలం సృష్టించింది.
Top