మరొక కొత్త నిర్ణయంతో చంద్రబాబు కి దడ పుట్టించబోతున్నా జగన్…!

మరొక కొత్త నిర్ణయంతో చంద్రబాబు కి దడ పుట్టించబోతున్నా జగన్…!

మరొక కొత్త నిర్ణయంతో చంద్రబాబు కి దడ పుట్టించబోతున్నా జగన్…!
 
విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా అవినీతి పాల్పడిందని దీంతో రాష్ట్రము అప్పుల ఊబిలో కోరుకు పోయిందని..గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి మరియు స్కాములు బయటకు తీయాలని ప్రజలకు తెలియాలని ఇటీవల ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ అధికారులకు చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఇప్పటికే అనేక విషయాలలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని అసెంబ్లీలో లేవనెత్తి దడ పుట్టిస్తున్న చంద్రబాబుపై తాజాగా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో జరిగిన అక్రమాలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు.
 
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు పాడయ్యాయని, వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా ఉన్నత విద్యామండలి అధికారులపై నిధుల విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ విషయంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలనీ జగన్ ఆదేశించారు. అయితే వచ్చే నెలాఖరుకల్లా ఈ విషయం మీద నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొత్తంమీద జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయటకు తీయడానికి కంకణం కట్టుకున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.Top