వణికిపోతున్న అరుణాచల్ ప్రదేశ్..!

Written By Siddhu Manchikanti | Updated: July 20, 2019 14:52 IST
వణికిపోతున్న అరుణాచల్ ప్రదేశ్..!

శుక్రవారం మరియు శనివారం ఈ రెండు రోజులలో అరుణాచల్ ప్రదేశ్ లో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడంతో..ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు భూకంపం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో రాష్ట్రంలోని ఈస్ట్కామేంగ్ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. మధ్యాహ్నం 3.04 గంటల సమయంలో ఇదే జిల్లాలో మరోసారి (3.8 తీవ్రత), 3.21 గంటల సమయంలో మూడోసారి కురుంగ్ కుమేయ్ జిల్లాలో (4.9 తీవ్రత) మరోసారి భూమి కంపించింది. అంతే కాకుండా తాజాగా శనివారం తెల్లవారుజామున పొద్దున 4:24 గంటల సమయంలో మరోసారి ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు.
Top