జగన్ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్..?

Written By Siddhu Manchikanti | Updated: July 21, 2019 13:57 IST
జగన్ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్..?

జగన్ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అమరావతి రాజధాని భవనాల విషయంలో రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన ప్రపంచ బ్యాంకు...తాజాగా ఒక విషయం లో జగన్ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేమిటంటే రాష్ట్రంలో ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించిందట. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయని కదనం వచ్చింది. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Top