మరో కీలక వికెట్ టిడిపిలో డౌన్..?

Written By Siddhu Manchikanti | Updated: July 21, 2019 14:01 IST
 మరో కీలక వికెట్ టిడిపిలో డౌన్..?

మరో కీలక వికెట్ టిడిపిలో డౌన్..?
 
రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణలో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన టీడీపీ ఆంధ్రాలో కొనఊపిరితో ఉన్నట్లుగా పార్టీ పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో బిజెపి ఏపీ టీడీపీ నాయకులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే చంద్రబాబు కు సన్నిహితంగా ఉండే కొంతమంది టిడిపి నాయకులు బిజెపి కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా టిడిపి పార్టీ కి చెందిన మరొకరు బిజెపిలో చేరడానికి సిద్దం అయినట్లు వార్తలు వచ్చాయి. నరసరాపుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు పార్టీకి గుడ్ బై చెప్పవచ్చని చెబుతున్నారు. అరవిందబాబు బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.ఒక వైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై పలు ఆరోపణలు,కేసులు వస్తుండడం, మరో వైపు టిడిపి కి చెందిన కొందరు ముఖ్యనేతలు పార్టీని వీడి బిజెపిలో చేరడానికి రంగం సిద్దం చేసుకోవడంతో పార్టీ అగమ్యగోచర పరిస్తితిలో పడే అవకాశం ఉందని పరిస్థితులను చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Top